Kalabhairava Ashtakam in Telugu

                                   Those who are in Shani mahardasa, those who have Shani doshas, those who are blamed, those who do not get results no matter how hard they work, will get good results if they read this Ashtaka. If you read Kalabhairavashtaka before going to sleep, you will not suffer from nightmares. Kalabhairavashtakam mantra to be recited every day to get rid of all enemy afflictions Bhutam Vashaka these results are just a few and there are many more.

                                  శని మహర్దశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు , నిందలు పడుతున్న వారు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు,  ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాలు పొందుతారు . నిద్రించే ముందు కాలభైరవాష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు . సమస్త శత్రు బాధలు భూతం విషాచ బాధలు తొలగిపోవాలంటే ప్రతి రోజు తప్పక చదవాల్సిన మంత్రం కాలభైరవాష్టకంఈ ఫలితాలు కొన్ని మాత్రమే మరెన్నో ఉన్నాయి .



కాలభైరవాష్టకం


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం

వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||


శూలటంకపాశదండపాణిమాదికారణం

శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం

భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం

నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||


అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం

దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం

కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహదైన్యలోభకోపతాపనాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || 9 ||


ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |